News August 22, 2025
సంగారెడ్డి: ఈనెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్లకు అపరాధ రుసుముతో ఈనెల 31 వరకు అడ్మిషన్ పొందవచ్చని జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి గురువారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి వంద రూపాయలు , ఇంటర్మీడియట్‌కి రూ. 200 అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News August 22, 2025
నల్గొండ: కొత్తగా బియ్యం తీసుకోబోతున్నారు..!

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. నల్గొండ జిల్లాలో మొదటిసారి 44,099 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో 89.15 లక్షల క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. అది ఈసారి 94.04 లక్షల క్వింటాలుగా ఉండనుంది.
News August 22, 2025
వరంగల్: యూరియా కోసం రక్తం చిందిస్తున్న రైతన్నలు

అదునుకు యూరియా వేయకపోతే పంట ఆగమవుతుందేమోనని భయంతో ఉమ్మడి వరంగల్ రైతన్నలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. MHBD(D) మరిపెడ(M) మల్లమ్మ కుంటతండాకు చెందిన రైతు లక్కా యూరియా కోసం క్యూలో నిలబడి సోమ్మసిల్లి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గూడూరు(M) లక్ష్మీపురానికి చెందిన రైతు బిచ్చనాయక్ యూరియా కోసం 40KM దూరం నుంచి కురవి(M) చింతపల్లికి వచ్చాడు. యూరియా దొరకక తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
News August 22, 2025
శ్రీరామపాదక్షేత్రంలో అద్భుత దృశ్యం

నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రంలో గురువారం సూర్యాస్తమయం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. నది అలలు, చల్లటి గాలులు, ఆకాశంలో మెరిసిన సప్త వర్ణాలు భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ అందరూ పరవశించిపోయారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక అనుభూతి ఒకేచోట కలగడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.