News February 2, 2025
సంగారెడ్డి: ఈనెల 4న భౌతిక రసాయనశాస్త్ర ప్రతిభ పోటీ పరీక్ష

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఈనెల 4న నిర్వహించే బౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పోటీలకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆహ్వానిస్తూ జిల్లా బౌతికరసాయన ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌లు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
ఢిల్లీ బాటలో ఒడిశా.. మరి మన దగ్గర!

పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే పెట్రోల్/డీజిల్ విక్రయించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన JAN 1 నుంచి అమలు కానుండగా, ఢిల్లీలో ఇప్పటికే పాటిస్తున్నారు. దేశ రాజధాని మాదిరి అధ్వాన వాయు కాలుష్య పరిస్థితులు రాకూడదంటే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోనూ ఈ రూల్ తేవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కొంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని సూచిస్తున్నారు.
News December 23, 2025
గద్వాల: రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ జారిపడి వ్యక్తి మృతి

రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తూ జారి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం గద్వాలలో జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన చాకలి కొండన్న (49) కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో గద్వాల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని రైల్వే కానిస్టేబుల్ అశోక్ తెలిపారు.
News December 23, 2025
భారత్‌లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్

<<18623563>>హాదీ<<>> మరణం తర్వాత నెలకొన్న పరిణామాలతో భారత్-బంగ్లా సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా భారతీయులకు కాన్సులర్, వీసా సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతుందని చెప్పింది. హాదీ మృతి అనంతరం నెలకొన్న ఆందోళనలతో చటోగ్రామ్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌ను భారత్ సండే క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.


