News November 17, 2025
సంగారెడ్డి: ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
Similar News
News November 17, 2025
ESIC ఆల్వార్‌లో 252 పోస్టులు

రాజస్థాన్ ఆల్వార్‌లోని ESIC 252టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం: బండి సంజయ్

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కలెక్టర్‌ను ఆయన అభినందించారు.