News January 1, 2026

సంగారెడ్డి: ‘ఈ నెల 5లోగా పరీక్ష ఫీజు చెల్లించండి’

image

సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 5లోగా పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 5 చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం తమ పరిధిలోని అధ్యయన కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 2, 2026

జనవరి 2: చరిత్రలో ఈరోజు

image

✒1954 : భారతరత్న పురస్కారం ప్రారంభం
✒1918: తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం
✒1957: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (AVS) జననం (ఫొటోలో కుడివైపున)
✒1945: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మరణం (ఫొటోలో ఎడమవైపున)
✒2015: భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ మరణం

News January 2, 2026

5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

image

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.

News January 2, 2026

ఉమ్మడి వరంగల్‌లో రూ.48 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు!

image

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు రూ.48 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరాని ఆహ్వానించే వేడుకల్లో మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 134 బార్/ రెస్టారెంట్, 295 వైన్సుల ద్వారా కొనుగోలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.