News June 25, 2024

సంగారెడ్డి: ఈ బాలుడి వివరాలు తెలిస్తే చెప్పండి ! 

image

అర్బాజ్(7) అనే బాలుడు సోమవారం సాయంత్రం సంగారెడ్డి పోలీసులకు దొరికాడు. శంకర్‌పల్లి ఆర్టీసీ బస్సులో వచ్చిన బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో దిగాడు. ఈ బాలుడిని గుర్తించిన పట్టణ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని బాలుర హోమ్‌కు తరలించారు. ఇతడి వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ భాస్కర్ తెలిపారు.

Similar News

News September 14, 2025

మెదక్: లోక్ అదాలత్‌లో 2,446 పోలీస్ కేసుల పరిష్కారం: ఎస్పీ

image

జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 2,446 పోలీసు కేసులు రాజీ కుదిరినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు లోక్ అదాలత్‌లో 106 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 24,19,680 బాధితుల ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకు నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపించడం జరిగినట్లు వివరించారు.

News September 13, 2025

మెదక్: లోక్ ఆదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

image

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.

News September 13, 2025

మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

image

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.