News September 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 59 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద పద్ధతిపై ఇన్స్‌ట్రక్టర్, ఆయాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్నదని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News September 8, 2025
వైసీపీ నేతలు అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి

CM చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుందని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి టి.జి భరత్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్నూలులో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సులభతర వాణిజ్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆయన అన్నారు.
News September 8, 2025
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కొమరాడ మండలం గుమడ వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. మృతుడికి 30 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. అతని శరీరంపై నీలం రంగు ప్యాంటు, గడుల చొక్కా ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. హెచ్ సీ రత్న కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
News September 8, 2025
వెరైటీ ఆఫర్.. బరువు తగ్గితే డబ్బులు

ఉద్యోగులు ఫిట్‌గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.