News March 12, 2025
సంగారెడ్డి: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో మంత్రి సమావేశం

ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని కొండా సురేఖ సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎస్జీఎఫ్ నిధులు కేటాయిస్తామని తెలిపారు.
Similar News
News April 5, 2026
కొండగట్టు అంజన్నకు రూ.1.63 కోట్ల ఆదాయం!

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.
News April 5, 2026
GNT: రూ.లక్షల్లో మోసం.. మహిళపై కేసు

బంగారం షాపు యజమానిని మోసం చేసిన మహిళపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించు కోవాలని చెప్పి ఓ మహిళ బంగారం షాపు యజమాని వద్ద రూ.19 లక్షల నగదుతో పాటు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను అప్పుగా తీసుకుంది. ఆమె తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 5, 2026
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.


