News August 21, 2025

సంగారెడ్డి: ఎంపికైతే నెలకు రూ.6వేలు

image

2035-26 సంవత్సరానికి దీన్ దయల్ స్పర్శ యోజన ఉపకార వేతనాల కోసం సెప్టెంబర్ 13 వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ డివిజన్ శ్రీహరి బుధవారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6 వేల ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు.

Similar News

News August 21, 2025

ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి!

image

TG: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మియాపూర్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2025

పిఠాపురం: కొత్త జంటకు తప్పని వరద కష్టాలు

image

కొత్తగా పెళ్లైన జంటను వరద కష్టాలు వెంటాడాయి. గొల్లప్రోలు కొత్త కాలనీకి చెందిన అపర్ణాదేవికి విశాఖ వాసి పార్థసారథితో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున వివాహమైంది. అత్తవారింటికి వచ్చేందుకు కొత్త జంట గొల్లప్రోలు చేరుకుంది. అయితే వరద నీరు అడ్డంకిగా మారింది. సుద్దగెడ్డ కాలువపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిచ్చెన ఎక్కి వంతెన దాటి కాలనీకి చేరుకోవాల్సి వచ్చింది.

News August 21, 2025

‘గుర్తేడు’ను మండల కేంద్రంగా చేయాలని డిమాండ్

image

గుర్తేడును మండల కేంద్రంగా చేయాలని బుధవారం పాతకోటలో గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుష్యంతుడు మాట్లాడుతూ.. గుర్తేడును మండల కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, కొంతమంది గిరిజనేతరులు స్వలాభం కోసం, రాజకీయ లబ్ధికోసం డొంకరాయి ప్రాంతాన్ని కేంద్రంగా చేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుర్తేడులోని ఐదు గిరిజన పంచాయతీ ప్రజలు బుధవారం భారీ ర్యాలీ చేస్తూ నిరసనలు తెలిపారు.