News October 5, 2025
సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం సహాయ కేంద్రం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి 81253 52721 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News October 5, 2025
ఒకే మొక్కకు 50 కాయలు

వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలిలో రైతు మీనుగ ఓబులేసు తన పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడం వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. ఒకే మొక్కకు 50 కాయలు కాశాయంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
News October 5, 2025
KHOJ టూల్, సైబర్ నేరాలపై అవగాహన

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా KHOJ టూల్, సైబర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా. అజిత వేజెండ్ల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
News October 5, 2025
టాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడా అదే: రాశీ ఖన్నా

టాలీవుడ్‌లో హీరోయిన్లను చాలా గౌరవిస్తారని రాశీ ఖన్నా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న తేడాపై ఆమె మాట్లాడారు. ‘తెలుగులో షూటింగ్ రోజూ 9 గంటలే ఉంటుంది. హిందీ, తమిళ ఇండస్ట్రీలో 12 గంటలు పని చేయాలి. దీంతో అలసిపోతాం. నన్ను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువ ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది.