News February 7, 2026

సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్

image

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల అభ్యంతరాలు, సమాచారం కోసం 81253 52721 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని, వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికలకు ఓటర్లు, అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News February 7, 2026

ఎచ్చెర్ల: ఈ కోర్సులకు ఎందుకు డిమాండ్..?

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు గత కొన్నేళ్లుగా శత శాతం ప్రవేశాలు జరుగుతున్నాయి. సైన్స్ విభాగంలోని కోర్సులకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలైటికల్ కెమిస్ట్రీ. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉండటం, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలకు ఈ కోర్సులు మార్గం చూపడమేనని విద్యార్థులు చెబుతున్నారు.

News February 7, 2026

TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

News February 7, 2026

ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

image

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.