News March 4, 2025

సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అంజిరెడ్డి ముందంజ

image

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 4వ రౌండ్ అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 30,961ల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 25,363ల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 21,248ల ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,598ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News September 18, 2025

వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

image

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.

News September 18, 2025

VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

image

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.

News September 18, 2025

చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

image

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.