News March 26, 2025
సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు నెల 31లోగా పీజీ చెల్లించాలని కలెక్టర్ వల్లురు క్రాంతి సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ. మున్సిపాలిటీ, పంచాయతీల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల31లోగా చెల్లించిన వారికి 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. 100% ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 2, 2026
మంథని: “సర్పంచ్ నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు”

మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మార్చి 2, 1935న ఉమ్మడి KNR (ప్రస్తుత భూపాలపల్లి జిల్లా) ధన్వాడ గ్రామంలో జన్మించారు. 1964-83 మధ్య ధన్వాడ సర్పంచ్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని MLAగా గెలిచారు. ఉమ్మడి AP శాసనసభకు 11వ స్పీకర్‌గా(1991–1995) సేవలకు గుర్తిస్తూ HYD ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు.
News March 2, 2026
రేపే చంద్రగ్రహణం.. ఏ టైమ్‌కు మొదలవుతుందంటే?

రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుంది. అయితే భారత్‌లో సాయంత్రం గం.6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇక మళ్లీ భారత్‌లో 2028 డిసెంబరు 31న సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు.
News March 2, 2026
విద్యార్థులకు ఇస్రో ‘యువికా’ ఆహ్వానం

అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో యువికా 2026 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మార్చి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి మే 11-22 వరకు వివిధ కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. క్విజ్, మార్కులు, క్రీడల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
వెబ్‌సైట్: isro.gov.in


