News August 13, 2025
సంగారెడ్డి: ఏడుగురి వైద్యులకు నోటీసులు జారీ: కలెక్టర్

సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో తనఖీ చేసిన సమయంలో సరైన రీతిలో స్పందించని ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో వైద్యులు విజయశంకర్, సత్యనారాయణ, దివాకర్, యాదగిరి, మల్లికార్జున్, ఉమామహేశ్వరి, రత్న సాయి ఉన్నారు. మూడు రోజుల్లో వివరణ పంపాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
నిర్మల్: రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లను సన్మానం

జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా.చంద్రశేఖర్‌రెడ్డిని కలెక్టర్ అభిలాష అభినవ్ ఘనంగా సన్మానించారు. ఈయనతో పాటు రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్‌లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి ఉన్నారు.
News August 13, 2025
మెదక్: అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.
News August 13, 2025
24 గంటల్లో బాలికల ఆచూకీ లభ్యం

చదువుకోమని తలిదండ్రులు మందలించడంతో ఇద్దరు బాలికలు ఇల్లు వదిలి వెళ్లిన ఘటన వేటపాలెంలో చోటుచేసుకుంది. స్కూల్‌కి వెళ్తున్నా అని చెప్పిన బయటకు వెళ్లి బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన SI జనార్ధన్ జిల్లా ఉన్నత అధికారుల సూచనలతో 5 విభాగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను 24 గంటల్లోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.