News December 31, 2024
సంగారెడ్డి: ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం: జగ్గారెడ్డి

తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తిరుమల దర్శనం అనుమతి ఇచ్చినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖకు స్పందించి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Similar News
News December 14, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సహకరించండి: డీఎస్పీ

మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News December 13, 2025
రెండో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: మెదక్ కలెక్టర్

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆయన పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది మార్గదర్శకాలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు, అనంతరం లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.
News December 13, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. జాగ్రత్తగా ఉండండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.1, మల్చెల్మ 7.0, మెదక్ జిల్లా దామరంచ 8.2, వెల్దుర్తి 9.0, సిద్దిపేట జిల్లా తిప్పారం 8.3, పోతారెడ్డి పేట 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలోనమోదయ్యాయి. చలి తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


