News March 23, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 3 నుంచి పదోన్నతి పొందిన టీచర్లకు శిక్షణ: డీఈవో

జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3 నుంచి 4 వరకు రెండు రోజుల పాటు పాఠశాల అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపైన మెదక్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 18, 2025
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.
News September 18, 2025
చింతపల్లి: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ వార్డు మెంబర్, శివాలయం అర్చకుడు వాడకాని రాజ్‌కుమార్ (35) నర్సీపట్నం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘాట్ 2వ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.
News September 18, 2025
మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.