News March 21, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 7 నుంచి 15 వ తేదీ వరకు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మూల్యాంకనం విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
Similar News
News March 28, 2025
NZB: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి: పోచారం

వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.
News March 28, 2025
వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పర్వతగిరి మండలానికి చెందిన వెంకన్న అప్పుల బాధతో వరంగల్ ఓ సిటీ మైదానంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్టర్ పోలీసులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఏపీలో బర్డ్‌ఫ్లూతో 6 లక్షల కోళ్లు మృతి: అంతర్జాతీయ సంస్థ

APలోని 8 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభించినట్లు పారిస్‌కు చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. కోళ్ల ఫామ్స్‌తో పాటు ఇంట్లో పెంచుకునే కోళ్లకూ ఇది సోకిందని తెలిపింది. రాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో H5N1 ఎక్కువగా విస్తరించినట్లు పేర్కొంది. దీనివల్ల 6,02,000 కోళ్లు చనిపోయినట్లు వివరించింది. కాగా ఇటీవల ఉ.గోదావరి, కృష్ణా, NTR జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.