News November 22, 2024
సంగారెడ్డి: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. 10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 22, 2024
MDK: నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.
News November 22, 2024
మెదక్ జిల్లాలో 86 శాతం సర్వే పూర్తి
మెదక్ జిల్లాలో సమగ్ర సర్వే నిన్నటి వరకు 86 శాతం పూర్తయిందని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ తెలిపారు. డేటా ఎంట్రీకోసం 516 మందిఆపరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. 20 మంది ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 04, ఎంపీ ఎస్వోలు-19లు ఈ డేటా ఎంట్రీలో పాల్గొంటారన్నారు. సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే కంప్యూటర్ ఆపరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.
News November 21, 2024
సిద్దిపేట: కొత్త కానిస్టేబుల్స్‌కు అభినందనలు: హరీశ్‌రావు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికై విధుల్లో చేరబోతున్న 8,047 కానిస్టేబుళ్లకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు అభినందనలు తెలిపారు. నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ పోస్టులను భర్తీ చేశారని, వీటిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.