News September 13, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 18 వరకు గడువు పెంచుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇది చివరి అవకాశం అని, అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

Similar News

News September 13, 2025

కుక్కలను చంపి పాపం మూటగట్టుకోవద్దు: మంత్రి

image

TG: వీధి కుక్కల సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘US లాంటి దేశాల్లో మనుషుల్లాగే కుక్కలకూ విలువ ఇస్తున్నారు. వాటిని చంపాల్సిన అవసరం లేదు. పాపం మూటగట్టుకోవద్దు. దత్తత తీసుకునే కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. కుక్క కాటుకు గురికాకుండా, ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి’ అని సూచించారు.

News September 13, 2025

తూ.గో: కొత్త కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో

image

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.

News September 13, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత

image

మాజీ మంత్రి, వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నా ఈనెల 9న జరిగిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.