News September 21, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలకు 893 మంది విద్యార్థులు

సంగారెడ్డి జిల్లాలో 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శనివారం తెలిపారు. పదో తరగతికి 272, ఇంటర్‌కు 621, మొత్తం 893 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతికి జడ్పీ బాలికల, ఇంటర్‌కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
40 గుడుంబా కేసులు నమోదు: MNCL CI

మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా అరికట్టేందుకు ఈ నెల 30 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఐ గురవయ్య తెలిపారు. గత నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన స్పెషల్ తనిఖీల్లో మొత్తం 40 గుడుంబా కేసులు నమోదు చేసినట్లు సీఐ గురువయ్య తెలిపారు. 38 మందిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. 44 మందిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
News September 21, 2025
ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
News September 21, 2025
పూలు పులకరించే సమయం

దేవతలకు పుష్పార్చన చేయడం సర్వసాధారణం. కానీ ఆ పూవులనే దేవతలుగా కొలచి ఆరాధించే అదృష్టం ‘బతుకమ్మ’ ద్వారా మనకు దక్కింది. ఈ లోకంలో పూలను పూజించే ఏకైక పండుగ ఇదే. ప్రకృతితో మమేకమై, పూల పవిత్రతను ఆరాధించే ఈ ఆచారం మన ఆధ్యాత్మిక అనుబంధానికి ఓ తార్కాణం. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. పూజలో వాడిన పూలే ఎంతో పులకరిస్తాయంటే.. పూజలందుకొని గంగమ్మను చేరే తంగేడు, గునుగు వంటి పూలు ఇంకెంత పరవశించునో కదా!