News December 27, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు పొందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును జనవరి 5 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈ 5వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర పూర్తి వివరాల కోసం తమ పరిధిలోని అధ్యయన కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 9, 2026
సిరిసిల్ల : పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

రేపటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
News January 9, 2026
జగిత్యాల జిల్లాలో గాలిపటాల దుకాణాలపై పోలీసుల తనిఖీలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. చైనా మాంజా వల్ల మనుషులు, చిన్నారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో పాటు పక్షులు, పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.
News January 9, 2026
కామారెడ్డి: ఎగిరే గాలిపటం.. కావొద్దు గాయం

సంక్రాంతి పండుగ వేళ రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయతీ. ఈ వినోదం మూగజీవుల ప్రాణాల మీదకు రాకూడదని, మనుషుల భద్రతకు విఘాతం కలగకూడదని కామారెడ్డి జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా గాలిపటాల విక్రయ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. షాపుల్లో నిల్వ ఉంచిన మాంజా రీళ్లను పరిశీలించారు. చైనా మాంజా వినియోగం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


