News March 16, 2025

సంగారెడ్డి: కమిషనర్లు, మేనేజర్లకు షోకాజ్ నోటీసులు

image

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వస్తువులు నిర్లక్ష్యం వహించిన అధికారులకు శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతి నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు ప్రసాద్ చౌహన్, ఉమ, ఉమ మహేశ్వర రావు, సూర్య ప్రకాష్, ఉమర్ సింగ్, ఉమేశ్వర్ లాల్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు సంగారెడ్డిలో 27, జహీరాబాద్‌లో 8, సదాశివపేటలో 14 మంది బిల్ కలెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చారు.

Similar News

News December 14, 2025

BHPL: ఉప సర్పంచ్ పదవిపై ఆశలు.. ముందస్తు వ్యూహాలు!

image

పంచాయతీలో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఉప సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రెండో విడత 4 మండలాల్లో 75 పంచాయతీల్లో కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితం తేలిన వెంటనే వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. మెజార్టీ సభ్యులు చేయి ఎత్తి మద్దతు తెలిపిన వ్యక్తి ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 14, 2025

పెద్దపల్లి: మొత్తం పోలింగ్ 80.84%

image

పెద్దపల్లి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 112,658 ఓటర్లలో 91,076 మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ 80.84%గా నమోదయింది. అంతర్గాం మండలంలో అత్యధికంగా 86.40%, జూలపల్లి మండలం 84.75%, పాలకుర్తి మండలం 81.90%, ధర్మారం మండలం 75.57% పోలింగ్ నమోదు కాగా , ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంట వరకు ముగిసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.

News December 14, 2025

పెద్దపల్లి: పల్లెపోరులో గెలిచి నిలిచేదెవరో..?

image

పెద్దపల్లి జిల్లాలోని రెండో దశ పోలింగ్‌లో 4 మండలాల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు జరిగిన ఈ పల్లెపోరులో ఎవరు గెలుస్తారో అనేది ఉత్కంఠంగా మారింది‌. కౌంటింగ్ ప్రక్రియ మొదలవడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మరి ఈ పల్లె పోరులో ఎవరు గెలుస్తారో కాసేపట్లో తెలుస్తుంది. మరింత సమాచారం కోసం Way2Newsను ఫాలో అవ్వండి.