News October 7, 2025
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. వాల్మీకి చూపిన మార్గంలో నేటి యువత నడవాలని కోరారు. భారత సాంస్కృతిక వారసత్వానికి రామాయణం ఆధారం అయిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సహాయ సంక్షేమ అధికారిణి అమర జ్యోతి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
రామ్మూర్తినాయుడుకు సీఎం నివాళులు

నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా నివాళులర్పించారు. ప్రథమ వర్ధంతికి సంబంధించిన క్రతువులో పాల్గొన్నారు. అనంతరం నారా రామ్మూర్తి నాయుడు స్మృతి వనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News October 7, 2025
కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ ములకలచెరువు ఎక్సైజ్ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.
News October 7, 2025
కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్‌స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్ లెంత్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>