News February 20, 2025

సంగారెడ్డి: కల్లు కోసం వచ్చి స్నేహితులు మృతి

image

జిన్నారం PS పరిధిలో చెరువులో మునిగి<<15514933>> ఇద్దరు యువకులు<<>> మృతి చెందారు. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ మంగళవారం సాయంత్రం వావిలాలలో కల్లు తాగేందుకు బైక్ పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు నిన్న దొరికాయి. స్నేహితులిద్దురి మృతి గ్రామంలో విషాదం నింపింది.

Similar News

News September 17, 2025

ఖమ్మం: నిజాంకు వ్యతిరేకంగా తనికెళ్ల వీరుల పోరాటం

image

నిజాం పాలనకు వ్యతిరేకంగా తనికెళ్ల గ్రామ ప్రజలు సాగించిన పోరాటం అత్యంత కీలకమని నిజాం వ్యతిరేక పోరాట యోధులు గుర్తుచేశారు. కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీతో పాటు తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, రామకృష్ణయ్య, ముత్తయ్య, యాస వెంకట లాలయ్య, మల్లెల వెంకటేశ్వరరావు దళంలో చేరి పోరాడారు. ఈ క్రమంలో రజాకారుల నుంచి సీతారామయ్యను గ్రామస్థులు తెలివిగా తప్పించిన వైనం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

News September 17, 2025

హుస్నాబాద్: ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలి: మంత్రి పొన్నం

image

సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మానవీయ కోణంలో ఆలోచించి సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల ఛార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిందని గుర్తు చేశారు.

News September 17, 2025

1-12 తరగతుల వరకు మార్పులు: CM

image

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.