News December 28, 2025

సంగారెడ్డి: కల్వర్టు గుంతలో పడి ముగ్గురి మృతి

image

నారాయణఖేడ్ పట్టణ శివారులో డబుల్ బెడ్ రూముల వద్ద నిజాంపేట్-బీదర్ 161బి హైవేపై నిర్మిస్తున్న కల్వర్టు గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఖేడ్ మండలం నర్సాపూర్‌కి చెందిన అవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేశ్ (23)గా గుర్తించారు. వీరు ఒకే బైకుపై ఖేడ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడి మృతి చెందారు.

Similar News

News December 28, 2025

‘మేకిన్ మల్కాపూర్’ 380 వారాలుగా స్వచ్ఛభారత్

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌లో 380 వారాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ‘మేకిన్ మల్కాపూర్’ నినాదంతో యువత గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్న గ్రామంగా ఎంపిక కావడంతో గ్రామస్థులు మరింత శ్రమిస్తున్నారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ ప్రతినిధులు, అధికారులు కలిసి శుభ్రత పనులను చేపట్టారు.

News December 28, 2025

శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలివే..!

image

నిన్న మహిళా కమిషన్ శివాజీకి సంధించిన ప్రశ్నలు బయటకు వచ్చాయి.
*మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది మీకు తెలియదా?
*మీ కామెంట్స్ మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. మీ సమాధానం?
>తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానన్న శివాజీ.. <<18646239>>మిగతా<<>> స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.

News December 28, 2025

వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.