News January 13, 2026

సంగారెడ్డి: కళాశాలలకు ప్రయోగశాల నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ప్రయోగశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రూ. 50,000 చొప్పున కేటాయించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అవసరమైన రసాయనాలు, పరికరాలను ఈ నిధులతో కొనుగోలు చేయాలని ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. దీంతో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య మరింత చేరువ కానుంది.

Similar News

News February 12, 2026

కాకినాడ-జొన్నాడ రోడ్డు విస్తరణకు మోక్షం.. బైపాస్‌లపై మొదలైన టెన్షన్!

image

రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్ కావడంతో కరప, వేలంగి గ్రామాల్లో బైపాస్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. అయితే, బైపాస్ మార్గం ఎటు నుంచి వెళ్తుంది? ఎంత భూమి, ఎన్ని ఇళ్లు కోల్పోవాల్సి వస్తుందోనని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అభివృద్ధి కావాలని కోరుకుంటున్నప్పటికీ, భూసేకరణ తమ కొంప ముంచుతుందేమోనని బాధితులు భయపడుతున్నారు. క్లారిటీ ఇవ్వాలని అధికారులు, పాలకులను ప్రజలు కోరుతున్నారు.

News February 12, 2026

US, వెనిజులా ఆయిల్ కొనుగోళ్లు పెంచండి.. కేంద్రం ఆదేశం!

image

అమెరికా, వెనిజులా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు పెంచాలని IOC, BPCL, HPCL తదితర రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. ‘ట్రేడ్ డీల్‌లో భాగంగా ఎనర్జీ కొనుగోళ్లు పెంచాలని ఇండియా చూస్తోంది. రష్యా ఆయిల్ దిగుమతిని తగ్గించుకోనుంది. స్పాట్ మార్కెట్ టెండర్లలో US గ్రేడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలని రిఫైనరీలను కోరింది. వెనిజులా ఆయిల్‌ను ట్రేడర్లతో ప్రైవేట్ చర్చల ద్వారా కొనాలని చెప్పింది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

News February 12, 2026

వరంగల్: బాక్సులో భవిష్యత్!

image

మున్సిపల్ పోరు ముగిసింది. ఇక ఫలితమే బాకీ ఉంది. బ్యాలెట్ బాక్సులో భవిష్యత్ ఉండటంతో అభ్యర్థుల్లో లబ్ డబ్ అంటూ గుండె వేగం పెరిగింది. మరో 24 గంటల్లో తమ పెట్టబడికి లాభామా? నష్టమా? అంటూ మథన పడుతున్నారు. మరో పక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎంత అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్, BRSలు ఇప్పటికే వార్డుల్లో సర్వే చేసుకున్నాయి.