News October 29, 2025

సంగారెడ్డి: కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

సంగారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ లా గురుకుల కళాశాలలో ఐదు సంవత్సరల కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎస్టీ-35 బీసీ-1 ఓసీ-2 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇంటర్ చదివి లా సెట్ అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.

Similar News

News October 29, 2025

మొంథా ఎఫెక్ట్.. సిటీ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సులు నేడు రద్దు

image

మొంథా తుపాను ప్రభావంతో నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దుచేశారు. ఒంగోలు, కాకినాడ, అమలాపురం, విశాఖపట్టణం వెళ్లే దాదాపు 30 బస్సులను బుధవారం రద్దుచేశారు. మొంథా ప్రభావానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఏపీ అధికారులతో మాట్లాడుతూ నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

News October 29, 2025

విజయమే లక్ష్యం.. జూబ్లీహిల్స్ కోసం కేబినెట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయానికి ఉన్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు బాధ్యతలు అప్పగించిన పార్టీ ఇపుడు మంత్రి వర్గంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తప్ప అందరికీ బాధ్యతలు అప్పగించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించి ప్రచారం చేపట్టనుంది. స్థానిక నేతలను సమన్వయ పరుస్తూ ఈ ప్రచారం కొనసాగనుంది.

News October 29, 2025

జూబ్లీహిల్స్‌ను చుట్టేసిన కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచార జోష్ పెంచిన కాంగ్రెస్ పార్టీ దాదాపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాన్ని చుట్టేసింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హంగామానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించిన పార్టీ ఇపుడు మంత్రులకు కూడా విధులు కేటాయించింది. ప్రతి 10 పోలింగ్ స్టేషన్లకు ఒక ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జీగా నియమించింది.