News February 18, 2025

సంగారెడ్డి: కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

image

ప్రతి విద్యార్థికి పదవ తరగతి కీలకమని.. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బీహెచ్ఈఎల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్నందున అన్ని పాఠ్యాంశాలను పూర్తిగా చదవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

Similar News

News December 25, 2025

డిసెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

image

✒ 1861: సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా జననం
✒ 1924: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(ఫొటోలో) జననం
✒ 1971: డైరెక్టర్ కరుణాకర్ జననం
✒ 1972: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి మరణం
✒ 1974: ప్రముఖ నటి, రాజకీయ నేత నగ్మా జననం
✒ 1981: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జననం
✒ సుపరిపాలన దినోత్సవం

News December 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 25, 2025

ADB: ఆన్లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

image

ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.