News April 15, 2025

సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

image

భార్యను భర్త హత్య చేసిన ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.

Similar News

News April 16, 2025

అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

image

AP: అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని, త్వరలోనే అమరావతి మెగాసిటీ కుట్ర బయటకొస్తుందని పేర్ని నాని వెల్లడించారు.

News April 16, 2025

50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష: వేపాడ

image

డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు బుధవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News April 16, 2025

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!