News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కొండాపూర్‌లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 26, 2026
ERగా తిరుపతి.. త్వరలో కొత్త ఉద్యోగాలు

APని 2.4 ట్రి.న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో GOVT తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER)కు ప్రత్యేక ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికలు రూపొందించనుంది. విశాఖ ER నమూనాను ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. TERలో 9 జిల్లాలు ఉండి, GSDPలో దాదాపు 34% వాటా కలిగి ఉంది. ఉద్యానవనం, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, స్పేస్‌టెక్, పర్యాటకం, విద్య రంగాల్లో ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.
News February 26, 2026
ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.
News February 26, 2026
కోదాడ: కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎంఆర్‌పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.


