News March 23, 2025
సంగారెడ్డి: కుళ్లిన శవం లభ్యం

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంది మండలం చిమ్మాపూర్‌లో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్ఐ రవీందర్ శనివారం తెలిపారు. గ్రామంలో మధ్యాహ్నం 12 గంటలకు శవం కనిపించినట్లు పంచాయతీ కార్యదర్శి సునీతా బాయి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతి చెంది 3 నెలలు గడిచి ఉంటుదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News September 19, 2025
సంగారెడ్డి: ‘31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా’

జిల్లాలో ఇప్పటివరకు 31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. 6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వారం వరకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News September 19, 2025
రాబోయే 4 రోజులు వర్షాలు

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.