News April 16, 2025
సంగారెడ్డి: కేజీబీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు

జిల్లాలోని 22 కేజీబీవీలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో చదివే బాలికలకు స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, తదితర కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్‌కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.
News September 15, 2025
ప్రెగ్నెన్సీలో డ్రైవింగ్.. సురక్షితమేనా?

చాలామంది గర్భిణులు ఉద్యోగం సహా ఇతర కారణాలతో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్కూటీ, కారును వారే స్వయంగా నడుపుతుంటారు. అయితే డాక్టర్ సలహాతో, గుంతలు లేని రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. నెలలు నిండే కొద్దీ బరువు పెరుగుతారు. కాబట్టి.. ఆ సమయంలో బ్రేక్ వేయటానికి, వాహనం బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వీలైనంత వరకు గర్భంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయటం తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News September 15, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.