News January 29, 2026

సంగారెడ్డి: ‘క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం’

image

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. సంగారెడ్డిలోని ఎస్ఎస్ గార్డెన్లో అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

‘శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు’

image

శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు అని AP FACT CHECK తెలియజేసింది. ‘ఆలయ ప్రాంగణంలో గాలిగోపురం వద్ద<<19154471>> ఒక మహిళ అచేతనంగా పడిఉన్నారనే<<>> సమాచారం మేరకు డ్యూటీ డాక్టర్ అక్కడకు చేరుకొని CPR ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఎక్కడా వైద్యుల, 108 వాహన నిర్లక్ష్యం లేదు. భక్తులను భయభ్రాంతులకు గురిచేసే తప్పుడు వార్తలు నమ్మవద్దు.’ అని తెలిపింది.

News February 16, 2026

సీఎం, బిల్‌గేట్స్‌ వీసీలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నాయుడు మైక్సోసాప్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బిల్‌గేట్స్‌కు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ డా.ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

News February 16, 2026

వరంగల్: కోల్డ్ స్టోరేజ్ నుంచి గ్యాస్ లికేజీ

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఒక కోల్డ్ స్టోరేజీ నుంచి అమోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్ తదితర కాలనీవాసులు కంటి మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో భయాందోళనకు గురయ్యారు. బాధితులు ఆందోళన చేయడంతో నిర్వాహకులు వెంటనే లీకేజీని అరికట్టారు. గ్యాస్ ప్రభావం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పడంతో అంతా శాంతించారు.