News February 1, 2025

సంగారెడ్డి: గంజాయి అమ్మి జైలు పాలయ్యాడు

image

గంజాయి అమ్మిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జడ్జి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2009 సంవత్సరంలో సంగారెడ్డిలో 5 కిలోల గంజాయి విక్రయిస్తూ మహమ్మద్ సెమీ అన్సారి అలియాస్ బిలాల్‌ను అప్పటి ఎక్సైజ్ సీఐ మధుబాబు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేసిన మధుబాబును అభినందించారు.

Similar News

News February 1, 2025

‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో

image

జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.

News February 1, 2025

రాష్ట్రంలో ఉక్కపోత షురూ

image

AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News February 1, 2025

నిర్మలమ్మ పద్దుపై కర్నూలు ప్రజల ఆశలు

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కర్నూలు జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కర్నూలు-మంత్రాలయం కొత్త లైన్, కర్నూలు నుంచి అమరావతికి నేరుగా రైలు సౌకర్యం, రిహాబిలిటేషన్ వర్క్‌షాపు పూర్తి కోసం నిధుల కేటాయింపుపై ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. ఇక ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రైల్వే లైన్‌పై ప్రకటన ఉంటుందో? లేదో? వేచి చూడాలి.