News December 15, 2025
సంగారెడ్డి: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు

గంజాయి కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరికిషన్ తెలిపారు. 2019లో గంజాయిని తరలిస్తూ నిఖిల్, శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్ అరెస్టు అయ్యారు. నేరం రుజువు కావడంతో జడ్జి వారికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
NRPT: ఎన్నికలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలు, మీడియాకు ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారని చెప్పారు. అందరి సహకారంతోనే సాధ్యమైందని అన్నారు.
News December 19, 2025
ప్రకాశం: 18 మంది కార్యదర్శులకు నోటీసులు.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్నులను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులకు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా రాత పూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని డీపీఓ ఆదేశించారు.
News December 19, 2025
యూరియా బుకింగ్.. 24hrsలోగా తీసుకోకపోతే..

TG: యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ <<18577487>>యాప్<<>> ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. యాప్‌లో బుక్ చేసిన 24 గంటల్లోగా వెళ్తేనే యూరియా బస్తాలు ఇస్తారు. లేదంటే మరో 15 రోజుల వరకు బుకింగ్‌కు అవకాశం ఉండదు. ప్రస్తుతం రైతులకు ఎకరా వరికి రెండున్నర బస్తాలు, మక్క, ఇతర పంటలకు 3 బస్తాలు, మిర్చికి 5 బస్తాల లిమిట్ పెట్టారు. బుక్ చేసుకున్న గంట తర్వాత నుంచే బస్తాలు తీసుకోవచ్చు.


