News March 5, 2025
సంగారెడ్డి: ‘గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 5, 2025
జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST
News March 5, 2025
వికారాబాద్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ నారాయణరెడ్డి

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టూ జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్లు మూసివేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు.
News March 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో 29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,558 మంది పరీక్ష రాయనున్నారు.