News January 25, 2026

సంగారెడ్డి: గణతంత్ర వేడుకలకు పోలీస్ గ్రౌండ్స్ సిద్ధం

image

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ పి.ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల దృష్ట్యా ఎస్పీ పరితోష్ పంకజ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో మైదానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News February 20, 2026

మ్యాక్సీ అరుదైన రికార్డు

image

AUS ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సాధించారు. T20Iలలో 2,000 రన్స్, 50 వికెట్లు తీసి, 50 క్యాచ్‌లు పట్టిన ఐదో క్రికెటర్‌గా నిలిచారు. T20WCలో ఇవాళ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. గతంలో నబీ(AFG), సికందర్(ZIM), హార్దిక్(IND), వీరందీప్ సింగ్(మలేషియా) ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది.

News February 20, 2026

గొంప: విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి

image

సరుగుడు కర్రల లోడు లారీ‌కి సపోర్టుగా కట్టిన కర్రలకు విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం గొంప గ్రామంలో చోటు చేసుకుంది. పెందుర్తిలో నివాసముంటున్న నేపాల్ దేశానికి చెందిన లారీ డ్రైవర్‌ పారదీప్ గొంప చెట్టువాని చెరువు వద్ద లారీలో సరుగుడు కర్ర లోడు వేసుకున్నారు. సపోర్టుగా ఉంచిన కర్రలకు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై స్పాట్‌లోనే చనిపోయాడని ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.

News February 20, 2026

ట్రంప్ తిక్క కుదిరింది

image

అగ్రరాజ్యానికి అధ్యక్షుడిననే అహంకారంతో టారిఫ్‌ల పేరుతో ఆటలాడిన ట్రంప్ తిక్క కుదిరింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎదిరించినా, మాట వినకపోయినా టారిఫ్‌లను బూచిగా చూపిన ఆయనకు <<19195677>>సుప్రీంకోర్టు తీర్పు<<>> షాకిచ్చింది. సుంకాల పేరుతోనే యుద్ధాలు ఆపానంటూ పలికిన బీరాలు ఇకపై చెల్లుబాటు కావు. డీల్స్ అన్నీ డొల్లగా మారడం ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశం. అంతర్జాతీయంగానూ ట్రంప్ ప్రాభవానికి ఎదురుదెబ్బేనని నిపుణుల అంచనా.