News October 11, 2025
సంగారెడ్డి: గిరిజన లా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని గిరిజన గురుకుల లా కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 13, 14న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఇంటర్ పాసైన, లాసెట్-2025లో అర్హత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న ఏకైక గిరిజన(Boys) గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇక్కడ చేరితే 5 ఏళ్ల లా కోర్సును ఉచితంగా పూర్తి చేయవచ్చని అన్నారు.
-SHARE IT
Similar News
News October 11, 2025
ఒంటిమిట్ట వద్ద లారీని ఢీకొన్న బస్సు

ఒంటిమిట్ట వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పులివెందుల ఆర్టీసీ బస్సు తిరుపతి వెళుతూ మార్గమధ్యంలోని ఒంటిమిట్ట ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌కు తీవ్రగాయాలు కాగా, ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News October 11, 2025
బాలికలకు భరోసానిద్దాం..

ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఇప్పటికీ వివక్ష, హింస వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాలికలకు కూడా సమాన హక్కులుండాలనే ఉద్దేశంతో అక్టోబర్ 11ని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది బాలికల నాయకత్వం, వారి స్వతంత్ర గుర్తింపు అనేది థీమ్. లింగ వివక్ష ఎక్కువగా ఇంటినుంచే మొదలవుతుంది. వారికి సమాన అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందంటున్నారు నిపుణులు.
News October 11, 2025
రాముడిపై భక్తితో 1,338KM నడిచిన భక్తుడు

రాముడిపై అనంతమైన భక్తితో గుజరాత్‌కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు లాల్ హర్జీవన్ దాస్ పటేల్ 1,338 కిలోమీటర్లు నడిచారు. భవ్య రామమందిర దర్శనం సంకల్పంగా ఆగస్టు 30న పాదయాత్ర ప్రారంభించి ప్రతిరోజు 35KM నడిచారు. మొత్తం 1,338KMను 40 రోజుల్లో పూర్తి చేసి, అయోధ్య చేరుకున్నారు. చిన్ననాటి కోరిక నెరవేరడం, రాముడిని దర్శించుకోవడం తన జన్మ ధన్యమైందని తెలిపారు. గతంలో 1990లో అద్వానీ రథయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు.