News March 12, 2025
సంగారెడ్డి: గ్రూప్-2లో జిల్లా వాసికి 3వ ర్యాంక్

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావుకు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించాడు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించాడు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీఓలో మెదక్ జిల్లాకు వచ్చాడు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.
Similar News
News February 6, 2026
ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.
News February 6, 2026
విజయవాడ: జగన్ పర్యటనలో స్వల్ప మార్పు!

YS జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన చివరి నిమిషంలో రూట్ మ్యాప్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల సూచనల మేరకు తాడేపల్లి నుంచి బయలుదేరే కాన్వాయ్.. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, గొల్లపూడి, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా జోగి నివాసానికి చేరుకోనుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వెస్ట్ బైపాస్ గుండా వెళ్లాలని పోలీసులు సూచించిన నేపథ్యంలో వైసీపీ కార్యాలయం ఈ మార్పులను ఖరారు చేసింది.
News February 6, 2026
MDK: స్వతంత్రులు 392.. సత్తా చాటగలరా?

ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ పోరులో స్వతంత్రులు (ఇండిపెండెంట్‌లు) సైతం సమరంలో నిలబడి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1,658 మంది పోటీ చేస్తుండగా అందులో 392 మంది ఇండిపెండెంట్‌లు పోటీలో ఉన్నారు. సంగారెడ్డిలో 11 మున్సిపాలిటీలకు 276 మంది, సిద్దిపేటలో 4 మున్సిపాలిటీలకు 73 మంది, మెదక్‌లో 4 మున్సిపాలిటీలకు 43 మంది చొప్పున స్వతంత్రులు బరిలో ఉన్నారు.


