News March 13, 2025

సంగారెడ్డి: చదివితే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

image

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

image

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

News September 15, 2025

కలెక్టర్ల సదస్సుకు పవన్ దూరం.. కారణమిదే?

image

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటంతో రాలేదని ఆయన PR0 తెలిపారు. ఈ రోజునే ప్రారంభమైన పితృకర్మ పూజలో పవన్ పాల్గొంటున్నారని చెప్పారు. దీంతో రేపు కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.

News September 15, 2025

వనపర్తి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాల్లో సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 135.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గణపూర్ 105.0 మి.మీ, గోపాల్‌పేట 104.0 మి.మీ, పెద్దమందడి 100.0 మి.మీ, వనపర్తి, పెబ్బేరు 73.0 మి.మీ, ఏదుల 68.0 మి.మీ, పాన్‌గల్ 64.0 మి.మీ, కొత్తకోట 52.0 మి.మీ, మదనాపూర్ 44.0 మి.మీ, వీపనగండ్ల 40.0 మి.మీ, చిన్నంబావి 33.0 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది.