News October 27, 2025
సంగారెడ్డి: చెరువులో యువతి మృతదేహం లభ్యం

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు చెరువులో మృతదేహాన్ని చూసి సమాచారం అందించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన ఫాతిమా(27)గా మృతదేహం వద్ద లభించిన ఆధారాల ద్వారా గుర్తించినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 28, 2025
వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.
News October 28, 2025
KNR: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ పమెల సత్పతి ఆధ్వర్యంలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23 వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.
News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.


