News December 19, 2025

సంగారెడ్డి చెరువుల మరమ్మతులకు రూ.9.15 కోట్ల నిధులు

image

సంగారెడ్డి మండలంలో 18 చెరువుల మరమ్మతులకు రూ. 9.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఈ నిధులతో చెరువుల మరమ్మత్తులు, అధునికీకరణం జరుగుతుందని చెప్పారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 23, 2025

మెదక్: సీనియర్ ఎస్పీగా శ్రీనివాస రావుకు ప్రమోషన్

image

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు సీనియర్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్‌ 2013 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులను 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఐపీఎస్(వేతన) నియమాలు, 2016 ప్రకారం పే మ్యాట్రిక్స్‌లోని లెవెల్ 13, సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి కోసం ఎంప్యానెల్ చేశారు. ఈ క్రమంలో డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

News December 23, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పులి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో 24 గంటల్లో చలి తీవ్రత పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.6 డిగ్రీలు, అల్గోల్ 8.0, మెదక్ జిల్లా దామరంచలో 9.4, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్‌లో 9.8, తిప్పారం 9.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 23, 2025

చెరుకుపల్లి: కనుమరుగవుతున్న ‘వినయాశ్రమం’ ఆనవాళ్లు

image

చెరుకుపల్లి (M) కావూరులోని ‘వినయాశ్రమం’. ఇది 1933 డిసెంబర్ 23న మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమై జాతీయోద్యమానికి ఊపిరి పోసింది. గాంధీజీ స్వయంగా నాటిన రావి మొక్క నేడు మహావృక్షంగా ఎదిగి నాటి స్మృతులకు సాక్ష్యంగా నిలిచింది. 1959లో రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఆశ్రమం రజతోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం 1992లో N.G రంగా కృషి విజ్ఞాన కేంద్రంగా మారింది. నేడు ఆదరణ లేక వెలవెలబోతోంది.