News July 9, 2025

సంగారెడ్డి: చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: డీఈవో

image

జహీరాబాద్ మండల విద్యాధికారిగా పని చేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. బుధవారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓలు పాల్గొన్నారు.

Similar News

News July 9, 2025

మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.

News July 9, 2025

కొంపల్లి రెస్టారెంట్‌ కేంద్రంగా డ్రగ్ దందా

image

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్‌ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.

News July 9, 2025

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే!

image

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో డ్రాగన్, దేవా సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత రైడ్ 2, రెట్రో, ద డిప్లొమాట్, ఎంపురన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విదాముయర్చి చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.