News June 12, 2024

సంగారెడ్డి: జర్మనీ భాషా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టాంకాం ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం జర్మనీ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిని వందన తెలిపారు. ఆసక్తి గలవారు www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాంకాం మొబైల్ యాప్‌లో సైతం దరఖాస్తులు సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 1, 2026

భారీ పొగమంచు.. వాహనదారులకు ఎస్పీ అలర్ట్

image

మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పొగమంచు సమయంలో వేగం తగ్గించి, హెడ్‌లైట్లు ఆన్ చేసి, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు. ద్విచక్ర, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.

News January 1, 2026

మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

image

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.

News January 1, 2026

మెదక్: ముగ్గురు పోలీస్ అధికారులకు సేవ పథకాలు

image

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్‌కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.