News September 13, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పారు.
Similar News
News September 13, 2025
బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
ములుగు: నెమలిలా నృత్యం.. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం!

శాస్త్రీయ నృత్యంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యరీతులు తమ పిల్లలకు నేర్పించేందుకు పేరెంట్స్ ముందుకు వస్తున్నారు. చిన్నారులు స్టేజిపై నెమలిలా నృత్యం చేస్తుంటే మురిసిపోతున్నారు. ఇటీవల రోజుల్లో ములుగు ప్రాంతంలో క్లాసికల్ డాన్స్‌కు క్రేజ్ పెరిగింది. పలువురు గురువులు వారాంతాల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పోటీల్లో టాలెంట్ చూపి బాలలు ప్రైజ్‌లు గెల్చుకుంటున్నారు.