News July 5, 2025
సంగారెడ్డి జిల్లాకు 19 ప్రభుత్వ పాఠశాలలు మంజూరు

సంగారెడ్డి జిల్లాకు నూతనంగా 19 ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జహీరాబాద్ మండలానికి 10, సంగారెడ్డి మండలానికి 4, రామచంద్రపురం మండలానికి 4, సదాశివపేట మండలానికి ఒక పాఠశాల మంజూరైనట్లు వెల్లడించారు.
Similar News
News July 5, 2025
సంగారెడ్డి: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

గరిష్ట ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
News July 5, 2025
ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.
News July 5, 2025
గంభీరావుపేట: ‘చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.