News August 20, 2025
సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలకు వినతి

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Similar News
News August 20, 2025
కోర్టులో ఏడుస్తూనే ఉన్నా: ధనశ్రీ వర్మ

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్‌తో విడాకుల సమయంలో కోర్టులో జరిగిన భావోద్వేగ క్షణాలను ధనశ్రీ వర్మ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో నేను అక్కడే నిలబడి ఉన్నా. నాకు తెలియకుండానే గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తున్నా. తీర్పు వచ్చిన వెంటనే చాహల్ బయటకి వెళ్లాడు. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే టెక్ట్స్ ఉన్న టీషర్ట్ ధరించడం ఏంటి? ఆయన ఇంకా పరిణితి చెందాలి’ అంటూ చాహల్‌కు పరోక్షంగా చురకలంటించారు.
News August 20, 2025
పాపన్నపేట: ‘నడవలేనని’ కళలకు జీవం పోస్తూ ముందడుగు..

తాను నడవలేనని బాధపడలేదు.. కనుమరుగవుతున్న కళలకు జీవం పొసేందుకు ముందడుగు వేశాడు ఓ దివ్యాంగుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పీజీలు చదివాడు. మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామానికి చెందిన దేవయ్య.. గ్రామ, మండల విద్యార్థులకు జడకోప్పు, కోలాటం, యోగ్చాప్, చెక్కభజనలో శిక్షణ ఇస్తున్నాడు. వీటికి అవసరమయ్యే సామగ్రిని అతడే కొనుగోలు చేసి సమాజ సేవలో తన వంతుగా సామజిక బాధ్యత వహిస్తున్నారు .
News August 20, 2025
EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>


