News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News March 24, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.
News March 24, 2025
యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.
News March 24, 2025
భూపాలపల్లి: వీణవంకలో 16టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.