News February 14, 2026

సంగారెడ్డి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఇస్నాపూర్ సహా అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి లెక్కింపును విజయవంతం చేశారని, ఫలితాల అనంతరం విజేతలకు ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు.

Similar News

News February 14, 2026

వేములవాడ: జాతర బందోబస్తు సిబ్బందికి ఎస్పీ సూచనలు

image

వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ మహేష్ బి గితే పలు సూచనలు చేశారు. శనివారం ఆయన స్థానిక తిప్పాపూర్ బస్టాండ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి, పట్టణ ఎస్సై వీరప్రసాద్ ఆయన వెంట ఉన్నారు.

News February 14, 2026

నరసరావుపేట నుంచి కోటప్పకొండకు బస్సుల టికెట్ ధరలు ఇలా..!

image

మహాశివరాత్రి జాతర దృష్ట్యా భక్తుల కోసం పల్నాడు జిల్లావ్యాప్తంగా 618 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) అజిత కుమారి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసరావుపేట నుంచి కోటప్పకొండ దిగువకు రూ.25, అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి రూ.30 చొప్పున ధరలు నిర్ణయించారు. నేరుగా నరసరావుపేట నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు రూ.55 టికెట్ ధరగా ఖరారు చేశారు.

News February 14, 2026

వేములవాడ: అలిగి, అజ్ఞాతంలోకి వెళ్లి.. టికెట్ సాధించి గెలిచారు..!

image

వేములవాడ 4వ వార్డ్ కౌన్సిలర్ తోట రాజు ఎన్నికలకు ముందు తనకు టికెట్ రాకపోవడంతో అలిగి అజ్ఞాతంలోకి వెళ్లి టికెట్ సాధించారు. సర్వే రిపోర్ట్ అనుకూలంగా లేదంటూ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ దిగివచ్చి టికెట్ కేటాయించడంతో సిటింగ్ కౌన్సిలర్, బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ పై స్వల్ప తేడాతో గెలుపొంది పరువు దక్కించుకున్నారు.