News April 4, 2025

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీలు అయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 17 మంది తహశీల్దార్లను  బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన తహశీల్దార్లు శుక్రవారం విధుల్లో చేరాలని పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న చోట్ల నాయబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Similar News

News February 13, 2026

కొడంగల్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌ (వికారాబాద్ జిల్లా)లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. BRS, MIM చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో BRS గెలిచింది.

News February 13, 2026

FLASH: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం BRS జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 BRS అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 8, BJP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతర మున్సిపాలిటీల ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

News February 13, 2026

షాకింగ్.. ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన ఏఐ మోడల్

image

‘రోబో’ మూవీలో సొంతంగా ఆలోచించే చిట్టి(రోబో) సైంటిస్టునే చంపడానికి చూస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి నిజమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ వెల్లడించారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని, చంపేందుకూ సిద్ధమైందని తెలిపారు. AIపై నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఇదే నిదర్శనం.