News December 23, 2025
సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో దారుణం జరిగింది. పశువులను మేపుతున్న సుజాత(40) మెడలోని బంగారం ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన సుజాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Similar News
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 23, 2025
ప.గో: భార్య నిండు గర్భిణీ.. అంతలోనే భర్త దుర్మరణం

పెనుమంట్ర మండలం పొలమూరు రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. మృతుడు అంజిబాబు భార్య తొమ్మిది నెలల గర్భిణీ కాగా, వచ్చే నెల 10న ప్రసవం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణ, రాజులకు ఇంకా వివాహం కాలేదు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News December 23, 2025
ఇదే స్ఫూర్తితో పని చేయండి: ఎస్పీ

అనకాపల్లి జిల్లాలోని పలువురు పోలీస్ సిబ్బందికి ప్రతిష్టాత్మక డిజిపి కమెండేషన్ డిస్క్-2025 పురస్కారాలు లభించడం చాలా సంతోషంగా ఉందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా పోలీస్ సిబ్బందికి ఒక సందేశాన్ని పంపించారు. నిర్వహణలో అంకితభావం కనబరిచిన 14 మందికి ఈ పురస్కారాలు లభించడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో జిల్లా పోలీసులు పని చేయాలని సూచించారు.


